: కేంద్రం కావాలనే నా 'ఎన్జీవో'ను టార్గెట్ చేసింది: కేంద్ర మాజీ మంత్రి భార్య
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం 'రాజకీయ ప్రతీకారం' తీర్చుకోవాలనుకుంటోందని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ భార్య లూయిస్ ఖుర్షీద్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆమెకు చెందిన ఓ ఎన్జీవో (స్వచ్చంద)పై కేసు నమోదు చేసి, సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మండిపడుతున్న ఖుర్షీద్ భార్య, సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నానని అన్నారు. అయితే, బ్లాక్ లిస్టులో ఉన్న మిగతా 93 ఎన్జీవోలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. సామాజిక న్యాయ శాఖ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ లో, ప్రధాని ఇటీవల దత్తత తీసుకున్న ఉత్తరప్రదేశ్ లో 33 ఎన్జీవోలు బ్లాక్ లిస్టులో ఉన్నాయని వివరించారు. కాగా, తన ఎన్జీవో ఉన్న స్థలం చట్ట ప్రకారమే ఉందని, కేంద్రం ఏదైనా చేస్తే కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.