: ఆరోపణలు అవాస్తవమని తేలితే కేసులు పెట్టండి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును వదులుకుంటున్నట్లు ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించడం, ప్రభుత్వంతో చర్చల తర్వాత తిరిగి పనులు కొనసాగిస్తామని చెప్పిన నేపథ్యంలో తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే, తనపై కేసులు పెట్టుకోవచ్చని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో ఎల్ అండ్ టీకి కేటాయించిన 32 ఎకరాల భూమిని మైహోమ్స్ అధినేత రామేశ్వరరావుకు ప్రభుత్వం బదిలీ చేసిందన్న తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఆయన గురువారం ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఈ భూముల బదలాయింపు వల్లనే ఎల్ అండ్ టీ, ప్రభుత్వం మధ్య విభేదాలు పొడచూపాయని కూడా రేవంత్ చెప్పారు. కేవలం ఓ వ్యక్తి ప్రయోజనాల కోసం, మెట్రో రైలు ప్రాజెక్టునే వదులుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని ఆయన ధ్వజమెత్తారు.