: నేడు శ్రీకాకుళంకు చంద్రబాబు... మహబూబ్ నగర్ కు కేసీఆర్
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ గురువారం జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అంతేకాక జిల్లాలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించనున్న చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్పంచుకోనున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో దాదాపు రూ. 2 వేల కోట్లతో ప్రారంభం కానున్న నాలుగు పరిశ్రమలకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గడచిన లోక్ సభలో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్, జిల్లాను అభివృద్ధి బాటలో నడిపేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.