: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పొత్తు దాదాపుగా ఖరారు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనల మధ్య పొత్తు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. బుధవారం ముంబైలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఈ మేరకు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. బుధవారం నాటి తన పర్యటనలో భాగంగా అమిత్ షా, శివసేన అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏఏ స్థానాల్లో ఎవరిని నిలబెట్టాలి, ఎవరి తరపున ఉమ్మడి ప్రచారం చేయాలి? అన్న అంశాలు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. నిన్నటిదాకా బాహాబాహీ అన్న రెండు పార్టీలు, అమిత్ షా పర్యటనతో నిశ్శబ్ధంగా ఓ అవగాహనకు వచ్చాయి. విభేదాలు వీడి ఎన్నికల్లో గెలిచేందుకు అవలంబించాల్సిన వ్యూహాల రచనలో మునిగిపోయాయి.