: సబర్మతీ ఆశ్రమంలో చైనా అధ్యక్షుడు
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. సతీసమేతంగా మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన జిన్ పింగ్ కు ప్రధాని నరేంద్ర మోడీ సబర్మతీ ఆశ్రమంలో నేటి సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు. తేనీటి విందు అనంతరం ఆశ్రమంలో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవి ముగిసిన అనంతరం సబర్మతీ తీరాన ప్రధాని ఇచ్చే ప్రత్యేక విందులో జిన్ పింగ్ పాల్గొంటారు. ఈ విందులో ప్రధానితో పాటు మరో ఐదుగురు మాత్రమే పాల్గొంటారని సమాచారం, అలాగే చైనా అధ్యక్షుడితో పాటు, అతని సతీమణి, మరో ఐదుగురు అధికారులు మాత్రమే పాల్గొంటారని సమాచారం. అది ముగిసిన అనంతరం ఆయన రాత్రికి ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.