: ఇంట్లో సాలీళ్ళను గుర్తించేందుకు యాప్!
సాలీడు చిన్నదైనా సరే, ఇంట్లో కనిపించగానే దాన్ని బయటికి నెట్టేయాలని చూస్తాం. పాత సామాన్లు, ఇంటి మూలలు వాటి ఆవాసాలు. అవి ఆహారంలో పడితే ఫుడ్ పాయిజనింగ్ తప్పదు. అడవుల్లో ఉండే కొన్నిరకాల సాలీళ్ళు కుడితే ప్రాణాపాయం సంభవిస్తుంది. సాధారణంగా ఇళ్ళల్లో కనిపించే సాలీళ్ళు చిన్నవిగానే ఉంటాయి. అయితే, వాటి కారణంగా కలిగే అసౌకర్యం ఎక్కువే. వీటిని గుర్తించేందుకు ఓ యాప్ రంగప్రవేశం చేసింది. దానిపేరు 'స్పైడర్ ఇన్ ద హౌస్'. 12 రకాల సాలీళ్ళ ఫొటోలు, వాటి వివరాలు ఈ యాప్ లో నిక్షిప్తమై ఉంటాయి. ఈ యాప్ ను ఆండ్రాయిడ్, ఆపిల్ యాప్ స్టోర్ల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ సాయంతో సాలీడును ఫొటో తీస్తే అది ఆడదో, మగదో ఇట్టే తెలుసుకోవచ్చట. అంతేగాకుండా, అది ప్రమాదకరమా? కాదా? అన్నది కూడా వివరిస్తుందట.