: ట్రావెల్స్ వ్యాపారంలోకి టీమిండియా మాజీ కోచ్


టీమిండియా వరల్డ్ కప్ సాధనలో కీలకపాత్ర పోషించిన సఫారీ క్రికెట్ దిగ్గజం గ్యారీ కిర్ స్టెన్ సొంతగా ట్రావెల్ ఏజెన్సీ ప్రారంభించాడు. ప్రపంచవ్యాప్తంగా మ్యాచ్ ల నిమిత్తం పర్యటనలు సాగించే ఆయా జట్లకు ఉపయోగపడేలా తన ఏజెన్సీలో ప్యాకేజీలు ఉన్నాయని గ్యారీ తెలిపాడు. డర్బన్ లో ఈ మాజీ కోచ్ మాట్లాడుతూ, తన కంపెనీకి 'గ్యారీ కిర్ స్టెన్ టూర్స్ అండ్ ట్రావెల్స్' పేరు పెట్టామని తెలిపాడు. కేప్ ఆఫ్రికా టూర్స్ సహకారంతో ఈ సంస్థను ప్రారంభించానని చెప్పాడు. గ్యారీ భారత జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత దక్షిణాఫ్రికా కోచ్ గా నియమితుడయ్యాడు. ఆ కాంట్రాక్టు ముగిసిన తర్వాత కేప్ టౌన్, డర్బన్ లో క్రికెట్ అకాడమీలు ప్రారంభించి జూనియర్లకు శిక్షణ ఇస్తున్నాడు.

  • Loading...

More Telugu News