: కేసీఆర్ తీరు 'వినాశకాలే విపరీత బుద్ధి' అన్నట్టుగా ఉంది: జానారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కేసీఆర్ రాజకీయాలను దిగజారుస్తున్నారని అన్నారు. పార్టీ గుర్తుతో గెలిచిన వారిని తమ పార్టీలోకి ఆహ్వానించి కేసీఆర్ తప్పుచేస్తున్నారని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే కనకయ్యపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారికి పిటిషన్ ఇచ్చామని ఆయన వెల్లడించారు. స్పీకర్ రాజ్యాంగపరంగా వ్యవహరిస్తారని తాను ఆశిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.