: చైనా అధ్యక్షుడి భారత్ పర్యటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో టిబెటన్ల ఆందోళన


చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా ఢిల్లీలోని చైనా దౌత్య కార్యాలయం ఎదుట టిబెటన్ లు ఈ ఉదయం ఆందోళనకు దిగారు. చైనా దురాక్రమణలో ఉన్న టిబెట్ స్వాతంత్ర్యం కోసం 2009 నుంచి 132 మంది టిబెటన్లు ఆత్మత్యాగం చేసుకున్నారని ఆందోళకారులు తెలిపారు. జిన్ పింగ్ తో సమావేశంలో టిబెట్ సమస్య లేవనెత్తాలని ప్రధాని నరేంద్రమోడీని వారు డిమాండ్ చేశారు. ఎంత వారించినప్పటికీ టిబెటన్లు తమ ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్యాహ్నం రెండు గంటలకు అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో చైనా అధ్యక్షుడు కుటుంబ సమేతంగా భారత్ నేలపై కాలుమోపనున్నారు.

  • Loading...

More Telugu News