: ఎల్ అండ్ టీ లేఖతో తెలంగాణ ప్రభుత్వంలో కదలిక


హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నామని ఎల్ అండ్ టీ సంస్థ రాసిన లేఖ విషయం ఈ రోజు పత్రికల్లో రావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక మొదలైంది. ఈ ఉదయం హుటాహుటిన హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు. అనంతరం వీరిద్దరూ కలసి... తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఎల్ అండ్ టీ లేఖ రాసిన నేపథ్యంలో... నష్ట నివారణ చర్యలతో పాటు... హైదరాబాద్ మెట్రోరైల్ పై రాబోయే కాలంలో వేయాల్సిన అడుగులను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

  • Loading...

More Telugu News