: సచిన్ మెడలో మరో మణిహారం


భారత క్రికెట్ చరిత్రలో మహోన్నత బ్యాట్స్ మన్ గా పేరొందిన సచిన్ టెండూల్కర్ కీర్తి కిరీటంలో మరో మణిపూస చేరనుంది. ప్రఖ్యాత జియాంట్స్ ఇంటర్నేషనల్ అవార్డుకు సచిన్ ఎంపికయ్యాడు. క్రీడల్లో జీవితకాల సాఫల్యత (లైఫ్ టైమ్ అచీవ్ మెంట్) కు గుర్తింపుగా సచిన్ కు ఈ పురస్కారం అందిస్తున్నారు. బాలీవుడ్ నుంచి అలనాటి డ్యాన్సింగ్ క్వీన్ హెలెన్ కు 'లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్' అవార్డు ఇవ్వనున్నారు. ముంబయిలో బుధవారం జరిగే ఓ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ ఏడాది జియాంట్స్ ఇంటర్నేషనల్ అవార్డులకు ఎంపికైన వారిలో ఉర్వి పిరమాల్ (వ్యాపారవేత్త), హేమంత్ థాకర్ (మెడిసిన్), కులిన్ కాంత్ లుథియా (సామాజిక సేవ), బాహుబలి షా (జర్నలిజం), అను మాలిక్ (మ్యూజిక్), పతంగ్ రావు కదమ్ (విద్య) ఉన్నారు. కాగా, భారత్ లో ఆరంభమైన తొలి అంతర్జాతీయ సేవా సంస్థగా జియాంట్స్ ఇంటర్నేషన్ కు పేరుంది. 1972 సెప్టెంబర్ 17న ఈ సంస్థ తన కార్యకలాపాలు ఆరంభించింది. దీనికి భారత్ లో 600 బ్రాంచీలు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా, ఉక్రెయిన్, మారిషస్ లోనూ సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతోంది.

  • Loading...

More Telugu News