: గవర్నర్ల తొలగింపుపై కేంద్రాన్ని నిలదీసిన షీలా దీక్షిత్


యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్ల తొలగింపుపై కేరళ మాజీ గవర్నర్ షీలా దీక్షిత్ కేంద్రాన్ని నిలదీశారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన ఆమె, యూపీఏ ప్రభుత్వంలో నియమించిన గవర్నర్లను పదవి నుంచి వైదొలగాలని ఎందుకు కోరారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అలాంటప్పుడు ఢిల్లీ, మధ్యప్రదేశ్ గవర్నర్లను మాత్రం ఎందుకు వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా వాళ్లను దిగిపోవాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. తొలగింపు వెనుక గల వివక్షను అర్థం చేసుకోవడంలో తాను విఫలమయ్యానన్నారు. మూడు నెలల కిందట మోడీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ముందుగా గవర్నర్ల మార్పుపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News