: పాక్ టి20 పగ్గాలు అఫ్రిదికి అప్పగింత


వన్డే జట్టు సారథిగా మిస్బావుల్ హక్ ను కొనసాగించాలని నిర్ణయించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), టి20 పగ్గాలను డైనమిక్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదికి అప్పగించింది. మిస్బా వన్డే జట్టు సారథిగా వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ వరకు కొనసాగుతాడు. ఇక, అఫ్రిది 2016 వరకు టి20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఈ మేరకు పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. టి20 జట్టుకు ఇప్పటివరకు మహ్మద్ హఫీజ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. క్రికెట్ కమిటీతో చర్చించాకే మిస్బా, అఫ్రిదిలను కెప్టెన్లుగా నిర్ణయించామని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు.

  • Loading...

More Telugu News