: ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.8.5 లక్షలు ఖర్చుపెట్టిన 'సోనాలికా' చైర్మన్


ట్రాక్టర్ల తయారీ సంస్థ 'సోనాలికా' చైర్మన్ ఎల్ డీ మిట్టల్ కొత్తకారుకు ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా రూ.8.5 లక్షలు చెల్లించారు. చండీగఢ్ లో సీహెచ్-01-ఏజెడ్ సిరీస్ లో 0001 నంబర్ కోసం రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ (ఆర్ఎల్ఏ) అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో పాల్గొన్న మిట్టల్ తమ గ్రూపుకు చెందిన నూతన 'మెర్సిడిస్ ఎస్' క్లాస్ కారు కోసమని ఈ నంబర్ ను ఇలా లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నారు. కాగా, 2013లో సీహెచ్-01-ఏటీ సిరీస్ లో 0001 నంబర్ కోసం వేలంగా నిర్వహించగా, ఓ వ్యక్తి ఆ నంబర్ ను రూ.9.1 లక్షలకు దక్కించుకున్నారని ఆర్ఎల్ఏ అధికారులు తెలిపారు. ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక మొత్తమని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News