: ఏపీలో నిరంతర విద్యుత్ పై కేంద్రంతో ఒప్పందం... వచ్చే నెల నుంచి అమల్లోకి


ఆంధ్రప్రదేశ్ లో నిరంతరాయ విద్యుత్ సరఫరాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అమల్లోకి రానుంది. 6,500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు నిర్మాణానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖలో 4వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఈ మేరకు ఒప్పందం కుదిరింది.

  • Loading...

More Telugu News