: చిన్నారెడ్డి దీక్ష భగ్నం
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి మాజీ ఎమ్మెల్యే జి. చిన్నారెడ్డి దీక్షను పోలీసులు ఎట్టకేలకు సోమవారం రాత్రి భగ్నం చేశారు. వనపర్తిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో గడచిన మూడు రోజులుగా చిన్నారెడ్డి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం రాత్రి దీక్షను భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులను చిన్నారెడ్డి అనుచరులు అడ్డుకోగా, చిన్నారెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి, సొంత ఇంటిలోనే దీక్ష కొనసాగించారు. సోమవారం ఆయన ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో పోలీసులు చిన్నారెడ్డిని బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.