: మోడీకి 'థాంక్స్' చెప్పిన కాశ్మీర్ సీఎం


వరదలతో అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్లో కేంద్రం చేపట్టిన సహాయక చర్యలపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం అందిస్తున్న మద్దతు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. క్యాబినెట్ సమావేశం సందర్భంగా ఆయన పైవిధంగా స్పందించారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు... ఇలా, కాశ్మీర్ ప్రజలకు సాయపడుతున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని ఒమర్ పేర్కొన్నారు. కాశ్మీర్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించగా, వందలాది మంది మరణించారు. లక్షలాదిగా నిరాశ్రయులయ్యారు. కేంద్ర బలగాలు వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

  • Loading...

More Telugu News