: శిల్పకళావేదికలో 'గోవిందుడు అందరివాడేలే' ఆడియో వేడుక


రామ్ చరణ్ హీరోగా నటించిన 'గోవిందుడు అందరివాడేలే' సినిమా ఆడియో వేడుక హైదరాబాదు శిల్పకళా వేదికలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి హాజరుకానున్నారు. ఆయన పాటల సీడీలను ఆవిష్కరిస్తారు. వెర్సటైల్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బండ్ల గణేశ్ నిర్మాత. చెర్రీ సరసన కాజల్ అగర్వాల్ అందాలు ఆరబోసింది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

  • Loading...

More Telugu News