: కాశ్మీర్ లోయలో రైలు సర్వీసులు పాక్షికంగా పునరుద్ధరణ
భారీ వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టిన పదకొండు రోజుల తర్వాత ట్రైన్ సర్వీసులను కాశ్మీర్ లోయలో పాక్షికంగా నడపాలని నిర్ణయించారు. వరద నీటి కారణంగా ట్రాక్స్ పూర్తిగా పాడవడంతో శ్రీనగర్, బారాముల్లా మధ్య సర్వీసులను నడుపుతున్నట్లు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. లోయలోని మిగతా ప్రాంతాల్లో కూడా రైలు సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. మరోవైపు, కాశ్మీర్ లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.