: వ్యభిచారి అనుకుని హాలీవుడ్ నటిని అరెస్టు చేశారు!


లాస్ ఏంజెలిస్ పోలీసులు పొరబడ్డారు. ఆస్కార్ నామినేటెడ్ సినిమా 'డిజాంగో అన్ చైన్డ్'లో నటించిన డానియెలే వాట్స్ ను వ్యభిచారి అని భావించి అదుపులోకి తీసుకున్న ఘటన అమెరికాలో జరిగింది. వాట్స్, ఆమె శ్వేతజాతి మిత్రుడు ఓ సిల్వర్ కలర్ మెర్సిడిస్ కారులో 'సన్నిహిత స్థితి'లో ఉండగా, 'ఓ జంట కార్లో మహా ఇదయిపోతోంది' అంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు వాట్స్ ను, ఆమె స్నేహితుడు బ్రయాన్ లూకాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమె నటి అని తెలుసుకున్న పోలీసులు, అనంతరం, విడిచిపెట్టారు. పాపం, వాట్స్ చేతులకు హ్యాండ్ కఫ్స్ తగిలించి తీసుకుని వెళ్ళారట ఎల్ఏ పోలీసులు. వాట్స్ కేసీబీఎస్ టీవీతో ఈ వివరాలను పంచుకుంది.

  • Loading...

More Telugu News