: పాక్ మాజీ క్రికెటర్ ఇంటిపై పోలీసు దాడులు


పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ ఖాదిర్ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. రాజకీయ కారణాలతోనే ఈ లెగ్ స్పిన్ దిగ్గజం నివాసంలోకి పోలీసులు ప్రవేశించినట్టు తెలుస్తోంది. మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ)కు ఖాదిర్ గట్టి మద్దతుదారుడు. జాతీయ జట్టుకు ఆడే రోజుల్లో ఖాదిర్... ఇమ్రాన్ కు సన్నిహితుడని పేరుపడ్డాడు. అంతేగాకుండా, ఖాదిర్ కుమార్తె ఫాతిమా (24) తెహ్రీకే పార్టీ మహిళా విభాగం సీనియర్ సభ్యురాలు. కుమారుడు కూడా అదే పార్టీలో సభ్యుడు. ప్రధాని నవాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కు మద్దతిస్తున్న కార్యకర్తలపై గత రెండ్రోజులుగా పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. కాగా, తన నివాసంపై పోలీసుల దాడుల వ్యవహారంలో వ్యాఖ్యానించడానికి ఖాదిర్ నిరాకరించారు. అయితే, శుక్రవారం రాత్రి ఖాదిర్ నివాసంపై పోలీసు దాడులు జరిగాయని పాక్ లోని టీవీ చానళ్ళు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News