: ‘ఈ-పాస్’తో బోగస్ రేషన్ కార్డులకు చెక్!
ఈ-పాస్ విధానంతో బోగస్ రేషన్ కార్డులకు చెక్ పెట్టనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ విధానాన్ని తొలుత తూర్పు గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నట్లు ఆమె ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రాజమండ్రి వచ్చిన సందర్భంగా ఆమె ఈ మేరకు ప్రకటించారు. సంక్షేమ పథకాలన్నిటిేనీ ఆధార్ కార్డులతో ముడిపెడుతున్నామని ప్రకటించిన మంత్రి, అందరూ ఆధార్ కార్డులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ప్రయోజనకారిగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.