ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూసేకరణ అంశంపై రేపు చర్చ జరగనుంది. ఇందుకోసం ఏపీ క్యాబినెట్ రేపు ఉదయం పది గంటలకు సమావేశం కానుంది. భూముల లభ్యత వివరాలు, రైతుల సమస్యలు తదితర అంశాలను రేపటి సమావేశంలో చర్చించనున్నారు.