: రోజాకి జగన్ ఫోన్!
చిత్తూరు జిల్లా నగరిలో నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై, వైఎస్సార్సీపీ అధినేత జగన్... రోజాకు ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జరిగిన దాడిని ఖండిస్తూ, పోలీసులు చూస్తుండగానే మహిళా శాసనసభ్యురాలిపై దాడి జరగడం దారుణమని పేర్కొన్నారు. నగరిలో అమ్మవారి జాతరలో పాల్గొన్న సందర్భంగా రోజా, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.