: నిత్యానందకు మరోసారి..!


వివాదాస్పద గురువు స్వామి నిత్యానందకు మరోసారి పురుషత్వ పరీక్షలు చేయనున్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశంతో నిత్యానంద ఈ నెల 8న పురుషత్వ పరీక్షలు చేయించుకోగా, అవి అసమగ్రంగానే ముగిసినట్టు సమాచారం. సంపూర్ణ ఫలితం రావాలంటే మరోసారి పరీక్షలు నిర్వహించకతప్పదని వైద్యులు భావిస్తున్నారు. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో ఆయనకు పురుషత్వ పరీక్షలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పరీక్షల నివేదికను అక్కడి డాక్టర్లు ఇంకా పోలీసులకు అందజేయలేదు. మరోసారి పరీక్షలు జరిపిన అనంతరమే, పూర్తిస్థాయి నివేదికను అందజేసే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News