: సాయి భక్తుల విదేశీ నిధులుపై దర్యాప్తు కోరుతున్న శంకరాచార్య
షిరిడీ సాయిబాబా దేవుడే కాదని, ఆయన్ను పూజించవద్దంటూ వివాదానికి తెరతీసిన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి తాజాగా సాయి భక్తుల విదేశీ నిధులపై వ్యాఖ్యానించారు. సాయి బాబా మద్దతుదారుల ఖాతాల్లోకి వస్తున్న విదేశీ నిధులపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. "సాయి మద్దతుదారులుగా పేరొందిన వారి ఖాతాలు, టెలిఫోన్ రికార్డులను తప్పకుండా పరిశోధన చేయాలి. ఎవరు వారికి నిధులను ఇస్తున్నారో, సనాతన ధర్మాన్ని వక్రీకరించేందుకు ఏ విదేశీ శక్తి ప్రయత్నిస్తోందో దేశం మొత్తానికి తెలియాలి. వాటన్నింటినీ ప్రజల ముందు బహిర్గతం చేసేందుకు దర్యాప్తు జరిపించాలని హోమంత్రిత్వ శాఖను డిమాండ్ చేస్తున్నాము" అన్నారు ద్వారకా పిఠ్ శంకరాచార్య.