: ట్విట్టర్లో విడుదల కానున్న 'సత్యమేవ జయతే' మూడో సీజన్ ప్రోమో!


బాలీవుడ్ మిస్టర్ ఫెర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ వ్యాఖ్యాతగా దేశవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ‘సత్యమేవ జయతే’ మూడో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. పలు సామాజిక సమస్యలపై సూటి ప్రశ్నలను సంధిస్తున్న ఆమిర్ ఖాన్, ఆయా సమస్యలపై దేశ ప్రజలను ఆలోచింపజేసేలా చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని వర్గాల నుంచి విమర్శలనూ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ స్టార్ ప్లస్ కార్యక్రమం మూడో సీజన్ ప్రారంభించనుంది. తాజాగా సత్యమేవ జయతే మూడో సీజన్ ప్రోమోలను తొలుత ట్విట్టర్లో విడుదల చేయాలని ఆమిర్ ఖాన్ భావిస్తున్నారట. ట్విట్టర్ లో ప్రోమో విడుదల కానున్న తొలి కార్యక్రమంగా వినుతికెక్కనున్న సత్యమేవ జయతే, తన క్లిప్పింగ్ లను కూడా ట్విట్టర్ లో నెటిజన్లకు అందుబాటులోకి తేనుందట.

  • Loading...

More Telugu News