: చంద్రబాబు సూచనలకు సానుకూలంగా స్పందించిన 14వ ఆర్థిక సంఘం
14వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో చంద్రబాబు ఈరోజు తిరుపతిలో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత విలేకరులతో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ ఆర్థిక సంఘానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్థిక సంఘానికి రెండు విజ్ఞాపన పత్రాలు కూడా ఇచ్చామని తెలిపారు. కొత్తరాష్ట్రం కాబట్టి ఇతర రాష్ట్రాలతో పోల్చి చూడొద్దని, కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని కోరామన్నారు. కొత్త రాష్ట్రంలోని ఇబ్బందులను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి సిఫార్సు చేయాలని... రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధి ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆర్ధిక సంఘాన్ని కోరారు. చంద్రబాబు విజ్ఞాపనలకు ఆర్థిక సంఘం సభ్యులు అత్యంత సానుకూలంగా స్పందించారని సమావేశంలో పాల్గొన్న మంత్రులు వెల్లడించారు.