: రేపటి నుంచి భారత్ లో మరో క్రికెట్ సమరం


క్రికెట్ ను పిచ్చిగా అభిమానించే భారత్ లో రేపటి నుంచి చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ఈ నెల 16 వరకు క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. 17 నుంచి మెయిన్ డ్రా పోటీలు ఉంటాయి. తొలి క్వాలిఫయింగ్ మ్యాచ్ లో సదరన్ ఎక్స్ ప్రెస్, నార్తర్న్ నైట్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ కు రాయ్ పూర్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక. కాగా, గతేడాది సీఎల్ టి20 టైటిల్ నెగ్గిన ముంబయి ఇండియన్స్ ఈ మారు అర్హత పోటీల్లో పాల్గొనక తప్పడంలేదు. గత ఐపీఎల్ లో పేలవ ప్రదర్శనే అందుకు కారణం. టోర్నీలో భారత్ నుంచి ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్... పాకిస్థాన్ నుంచి లాహోర్ లయన్స్, ఆస్ట్రేలియా నుంచి హోబర్ట్ హరికేన్స్, పెర్త్ స్కార్చర్స్... శ్రీలంక నుంచి సదరన్ ఎక్స్ ప్రెస్, న్యూజిలాండ్ నుంచి నార్తర్న్ నైట్స్, దక్షిణాఫ్రికా నుంచి కేప్ కోబ్రాస్, డాల్ఫిన్స్, వెస్టిండీస్ నుంచి బార్బడోస్ ట్రైడెంట్స్ జట్లు పాల్గొంటున్నాయి.

  • Loading...

More Telugu News