: ఐదుగురు పిల్లల పాలిట తండ్రే యముడు
కన్నతండ్రే కసాయిగా మారాడు. భార్యపై కోపాన్ని పిల్లలపై చూపించాడా కిరాతకుడు. అమెరికాలోని తిమోతి రే జోన్స్ అనే వ్యక్తి తన ఐదుగురు పిల్లలను తన ఇంట్లోనే చంపేసినట్టు కేసు నమోదైంది. దీనిలో భాగంగా పోలీసులు జోన్స్ ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. హైవేలో జోన్స్ కారును తనిఖీ చేసినప్పుడు అందులో రక్తపు మరకలు, పిల్లల దుస్తులు కనిపించాయి. వారం రోజులుగా పిల్లలు కనిపించడం లేదని వారి తల్లి, జోన్స్ నుంచి విడాకులు తీసుకున్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనే వారిని కడతేర్చినట్టు భావిస్తున్నారు. హైవే సమీపంలో పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా జోన్స్ పై 2001లో కారు దొంగతనం, డ్రగ్ సరఫరా కేసులు కూడా నమోదయ్యాయి.