: జమ్మూలో పాఠశాలలు పునఃప్రారంభం


భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడం, వరద నీరు నెమ్మదిగా పోవడంతో దాదాపు వారం రోజుల తర్వాత జమ్మూ ప్రాంతంలో విద్యాలయాలను తిరిగి ప్రారంభించారు. వరద ప్రభావానికి దెబ్బతిన్న శ్రీనగర్ లో కొన్ని చోట్ల నీరు కొంత లేనప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో వరదల పరిస్థితి అలాగే ఉంది. అటు వరదల కారణంగా పలుచోట్ల చిక్కుకుపోయిన వారికి సహాయక సామగ్రిని సరఫరా చేస్తున్నారు. * వందేళ్ల తర్వాత జమ్మూకాశ్మీర్ ను కకావికలం చేసిన దారుణమైన వరదల కారణంగా 200 మంది చనిపోయారు. నిరంతర అన్వేషణతో లక్షా పదివేల మంది పౌరులను రక్షణ సిబ్బంది రక్షించారు. సాయుధ దళాలు, ఎన్ డీఆర్ఎఫ్, లక్షల మంది అలసిపోకుండా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే కార్యక్రమంలో పాల్గొన్నారు. * ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి శ్రీనగర్ లోనే ఉండి స్వయంగా సహాయక, రక్షణ పనులను కోఆర్డినేట్ చేస్తున్నారు. * గత అర్ధరాత్రి జరిపిన ఓ ఆపరేషన్ లో కూలిపోయిన ఓ బిల్డింగ్ పై నుంచి పడి చిక్కుకున్న డెబ్బై మంది ఆర్ పీఎఫ్ లేదా సీఆర్ పీఎఫ్ అధికారులను ఎన్ డీఆర్ఎఫ్ రక్షించింది. * ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టగా, కొంతమంది తన ఇళ్లను వదిలి బయటకు వచ్చేందుకు సుముఖంగా లేరు. మరోవైపు వరదల నుంచి సురక్షితంగా బయటపడ్డ వారికి ఏమైనా జబ్బులు రావచ్చేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. అయితే, అలాంటి వారికోసం సహాయక చర్యలను తిరిగి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. * భారత ఆర్మీలోని 30వేల దళాలు జమ్మూకాశ్మీర్ సహాయక చర్యల్లో పాల్గొన్నగా, శ్రీనగర్ ప్రాంతంలోని సహాయ చర్యల్లో 21వేల మంది, జమ్మూ ప్రాంతంలో 9వేల మంది ఉన్నారు. * సహాయక చర్యల్లో పాల్గొన్న కొంతమంది ఆర్మీ దళాలు వెనుదిరిగి వచ్చాయి. హెలికాప్టర్ ద్వారా ఆహార పోట్లాలు, వస్తు సామాగ్రి అందించేందుకు వెళ్లిన హెలికాప్టర్ పై శ్రీనగర్ లో కోపోద్రిక్తులైన ప్రజలు రాళ్లు విసిరారు. * కొంతమంది వేర్పాటువాదులు ప్రజలను రెచ్చగొట్టి ఇలా చేస్తున్నారని రక్షణ దళాలు అనుమానిస్తున్నాయి. నిత్యావసర వస్తువులైన మంచినీరు, ఆహారంను పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కొంతమందికి చేరుతున్నాయి. ఇప్పటికే 2,24,000 లీటర్ల నీరు. 31,500 ఆహార పొట్లాలు, 375 టన్నుల వండిన అన్నంను హెలికాప్టర్ల ద్వారా వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి పంపిణీ చేసినట్లు అధికారిక ప్రకటనల తెలిపారు. * రాష్ట్రంలో సమాచార, టెలిపోన్ కనెక్టివిటీని పునరుద్ధరిండంపై దృష్టి పెట్టారు. దాంతో, బుధవారం నుంచి బీఎస్ఎన్ ఎల్ టెలిఫోన్ కనెక్షన్ అందుబాటులోకి వచ్చింది. ఎక్కడికక్కడ తెగిపోయిన రహదారుల లింకును కలిపేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఉచితంగా పనిచేస్తోంది.

  • Loading...

More Telugu News