: మరో టైటిల్ కోసం ఉరకలేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోసారి చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ టైటిల్ సాధించాలని ఉవ్విళ్ళూరుతోంది. ప్రస్తుతం సీఎల్ టీ20 సమరాంగణంలో ఉన్న జట్లలో చెన్నై జట్టు బలంగా కనిపిస్తోంది. చెన్నై జట్టు రెండు సార్లు ఐపీఎల్ నెగ్గగా, ఓసారి సీఎల్ టీ20 టైటిల్ సాధించింది. ధోనీ నాయకత్వమే ఆ జట్టుకు అతిపెద్ద అండ. కివీస్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచింగ్ నైపుణ్యం కూడా ఈ దక్షిణాది జట్టుకు లాభిస్తోంది. ముఖ్యంగా, ముంబయి ఇండియన్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు బదిలీ అయిన విండీస్ విధ్వంసక ఆల్ రౌండర్ డ్వేన్ స్మిత్ జట్టుకు వరంలా భావించవచ్చు. సురేశ్ రైనా ఉండనే ఉన్నాడు. బౌలింగ్ లో ఈశ్వర్ పాండే, మోహిత్ సింగ్ వంటి కుర్రాళ్ళతో ధోనీ గత ఐపీఎల్ లో మంచి ఫలితాలనే రాబట్టాడు. టెస్టు దేశాల టి20 చాంపియన్లు, రన్నరప్ లు, మూడో స్థానంలో నిలిచిన జట్లు పాల్గొనే ఈ చాంపియన్స్ లీగ్ సమరం భారత్ వేదికగా రేపటి నుంచి ప్రారంభమై అక్టోబర్ 4 వరకు జరగనుంది.

  • Loading...

More Telugu News