: కిడ్నీల ఆరోగ్యానికి ఇవిగో సూత్రాలు
కిడ్నీల పనితీరు మానవ దేహాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తోంది. అవి దెబ్బతింటే ఆరోగ్యం క్రమేణా క్షీణించి మనిషి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. అంతటి కీలక అవయవాలను పరిరక్షించుకునేందుకు ఈ సూత్రాలు పాటిస్తే సరి అంటున్నారు నిపుణులు. * రోజూ వ్యాయామం చేయాలి. దాంతో, రక్తప్రసరణ సాఫీగా జరగుతుంది. * వయసుకు తగిన బరువును మెయింటైన్ చేయాలి. అధిక బరువుంటే, తగ్గించుకోవాలి. * ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ట్యూనా, బ్రిమ్ వంటి చేపలను కూడా తీసుకోవాలి. మాంసాహారాన్ని పరిమితంగానే స్వీకరించాలి. * మీకు మధుమేహం ఉంటే, బ్లడ్ షుగర్ లెవల్ ను నియంత్రణలో ఉంచుకోవాలి. * బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ను పరిశీలించాలి. * మీ కుటుంబంలోగానీ, వంశంలోగానీ ఎవరికైనా కిడ్నీ జబ్బులున్నాయేమో తెలుసుకోవాలి. ఉంటే, వైద్యుల సలహా పాటించాలి. * ఉప్పును పరిమిత మోతాదులోనే వాడాలి. * మద్యపానం, ధూమపానం వంటి అనారోగ్యకర అలవాట్లకు దూరంగా ఉండాలి. ధూమపానం అలవాటు ఉంటే వెంటనే విడనాడాలి. ఇవన్నీ పాటించడం ద్వారా మన కిడ్నీలను కాపాడుకోవచ్చు. తద్వారా, మన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవచ్చు.