: ఆరోగ్యశ్రీ పేరు మారింది: వైద్య మంత్రి కామినేని


ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా మారుస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, పాత్రికేయులు, ఉద్యోగులకు రెండు, మూడు వారాల్లో హెల్త్ కార్డులు అందజేస్తామని అన్నారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలను పెంచేందుకు, మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని, ఉన్న ఆసుపత్రుల్లో పూర్తి సౌకర్యాలను కల్పిస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News