: వైజాగ్ లో పోలీసులపై యుద్ధం... బార్లు తీరిన బైకులు
విశాఖపట్టణంలోని మూడు చమురు సంస్థలకు చెందిన ట్యాంకర్ల యజమానులు ట్రాఫిక్ పోలీసులపై యుద్ధం ప్రకటించారు. వైజాగ్ లోని హచ్ పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ కంపెనీల చమురు టెర్మినళ్ల నుంచి నిత్యం 700 ట్యాంకర్ల ద్వారా చమురు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా జరుగుతుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖలో పెరిగిన వాహన రద్దీ నేపథ్యంలో మూడు నెలల కింద భారీ వాహనాలకు నో ఎంట్రీ సమయాన్ని ప్రకటించారు. దీంతో తమ గమ్య స్థానాలకు వాహనాలు చేర్చేందుకు ఆలస్యమవుతుందని, తద్వారా లాభాల బాటలో ఉన్న తమ సంస్థలు నష్టపోతున్నాయని ఆరోపిస్తూ ట్యాంకర్ల యజమానులు ఆందోళన చేస్తున్నారు. డాక్ యార్డ్ పరిసరాల్లో తమ ట్యాంకర్లను నిలిపేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విశాఖలో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ నిండుకుని, బంకుల వద్ద బైకులు బార్లుతీరాయి.