: మీడియాపై తెలంగాణ సీఎం వ్యాఖ్యలు అభ్యంతరకరం: కట్జూ


తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ చానెళ్ల ప్రసారాల నిలిపివేత నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాపై చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ మండిపడ్డారు. ఈ మేరకు చానళ్ల ప్రసారాల నిలిపివేతను ఖండిస్తూ ఓ ప్రకటన చేసిన ఆయన, ఇటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కావని అన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మీడియా మెడలు విరిచేస్తాం అనడం, మీడియాను పాతాళానికి తొక్కుతామని, పాతర వేస్తామని మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం, ముందు తను మాట్లాడే తీరు సరిచేసుకోవాలని కట్జూ హితవు పలికారు. మీడియా స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని, మీడియా స్వేచ్ఛ రాజ్యాంగబద్ధమైనదని కట్జూ చెప్పారు. తెలంగాణలో బ్యాన్ చేసిన చానళ్లను వెంటనే పునరుద్ధరించాలన్న ఆయన, లేకుంటే, ఎమ్మెస్వోలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News