: అమిత్ షాపై దాఖలైన ఛార్జిషీట్ ను తిప్పిపంపిన యూపీ కోర్టు


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై దాఖలైన ఛార్జిషీటును లక్నోలోని స్థానిక ఎస్ జేఎం కోర్టు తిప్పిపంపింది. పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రాన్ని సాంకేతిక కారణంతో కోర్టు తిప్పిపంపింది. దీనిపై తాము తిరిగి పరిశీలిస్తామని యూపీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 2014 లోక్ సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో యూపీలోని ముజఫర్ నగర్ లో షా ప్రసంగిస్తూ, 2013 ముజఫర్ నగర్ అల్లర్లకు ప్రతీకారం తీర్చుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News