: బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ పై కేసు నమోదు


ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ నేత, గోరఖ్ పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లక్నోలోని మున్షి పులియా ప్రాంతంలో బహిరంగ ర్యాలీ నిర్వహించవద్దంటూ యూపీ రాష్ట్ర యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. కానీ, బీజేపీ నేతలు ఆ ఆదేశాలను బేఖాతరు చేసి అక్కడ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో యోగిపై, ర్యాలీలో పాల్గొన్న ఆ పార్టీ నేతలపై పలు సెక్షన్ల కింద ఘజియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు జిల్లా అధికారి ఒకరు తెలిపారు. అయితే, తాము ఈసీ ఆదేశాన్ని ఉల్లంఘించలేదని యూపీ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్ పాయ్ అన్నారు.

  • Loading...

More Telugu News