: మరో రెండు రోజులు ఆగండి... ఎంఎస్వోలపై ఎలాంటి చర్యలు ఉంటాయో తెలుస్తోంది: ప్రకాష్ జవదేవకర్
టీవీ9, ఏబీఎన్ చానళ్ల ప్రసారాల నిలిపివేతపై హైదరాబాద్ లో కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ స్పందించారు. మీడియా ప్రజాస్వామ్యానికి ఆత్మ అని... ప్రజాస్వామ్య విజయంలో మీడియా కీలకపాత్ర పోషిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో వ్యాసాలు రాసిన స్వాతంత్ర్య సమరయోధులు జైళ్ల పాలయ్యి ఎన్నో ఏళ్లు ఇబ్బందులు పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, 1975 ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు జర్నలిస్ట్ లు ఎన్నో కష్టాలు అనుభవించారని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ఎమ్ఎస్వోలపై ఎలాంటి చర్యలు తీసుకుంటామో తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాలని ఆయన జర్నలిస్ట్ లను కోరారు.