: ఆసియా గేమ్స్ కు సానియా, పేస్ దూరం
ఒకటి కావాలంటే మరోటి వదులుకోవాల్సిందేనన్న సూత్రాన్ని టెన్నిస్ క్రీడాకారులు కూడా అనుసరిస్తున్నారు. ర్యాంకింగ్స్ కోసం ఆసియా గేమ్స్ ను వదులుకునేందుకు భారత టెన్నిస్ స్టార్లు సానియా మీర్జా, లియాండర్ పేస్, రోహన్ బోపన్న సిద్ధపడ్డారు. వచ్చే నెల దక్షిణ కొరియాలో జరుగనున్న ఆసియా గేమ్స్ లో పాల్గోవడం లేదని వారు స్పష్టం చేశారు. అంతర్జాతీయ టోర్నీల్లో ర్యాంకింగ్స్ మెరుగుపరచుకునేందుకు సానియా, పేస్, బోపన్న ఆసియా గేమ్స్‌కు దూరమైనట్టు ఆలిండియా టెన్నిస్ సంఘం అధ్యక్షుడు అనిల్ ఖన్నా వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో జరిగే టూర్ ఫైనల్స్‌లో పాల్గొనేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు. డబ్ల్యూటీఏ, ఏటీపీ ఈవెంట్లలో పాల్గొంటారని ఆయన వివరించారు.