: 25 లక్షల రూపాయలు రోడ్డు మీదకి విసిరేశారు!
తూర్పు గోదావరి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు 25 లక్షల రూపాయల్ని రోడ్డుపై విసిరేసిన సంఘటన కలకలం రేపింది. అమలాపురం మండలం బట్నవిల్లిలో కొందరు వ్యక్తులు వాహనం నుంచి డబ్బుతో కూడిన బ్యాగును రోడ్డు మీదకి విసిరేసి వెళ్లిపోయారు. ఆ సంచిలో 25 లక్షల రూపాయలు ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. ఆ మొత్తాన్ని మీడియా సమక్షంలో పోలీసులకు అందజేస్తామని స్థానికులు వెల్లడించారు.