: తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసి, దోచేశారు!


అరాచకాల ఉత్తరప్రదేశ్ లో మృగాళ్ల దుశ్చర్యలకు అడ్డుకట్ట పడడం లేదు. మీరట్ సమీపంలోని ఖార్ఖాడ పట్టణంలో ముగ్గురు పిల్లల తల్లి (35) బ్యాంక్ కు వెళ్లింది. డబ్బులు తీసుకుని వస్తుండగా ముగ్గురు దుండగులు తుపాకీ చూపించి ఆమెను కిడ్నాప్ చేశారు. దగ్గర్లోని అడవికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఆమె దగ్గరున్న డబ్బు, మొబైల్ ఫోన్, బంగారు నగలు దోచుకుని వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితురాలిని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దుండగుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News