: వర్మపై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు... గణేశుడిపై వ్యాఖ్యల ఫలితం!


వినాయకుడిపై వ్యాఖ్యల ఫలితంగా దర్శకుడు రాంగోపాల్ వర్మపై హైదరాబాదులో మరో కేసు నమోదైంది. వినాయకుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన ఫిర్యాదు మేరకు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో వర్మపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వర్మపై ఇప్పటికే సరూర్ నగర్ పీఎస్ లో కేసు నమోదైంది. అటు, నాంపల్లి కోర్టులోనూ ఆయన వ్యాఖ్యలపై విచారణ జరపాలని పిటిషన్ వేశారు కూడా. మహారాష్ట్రలోనే వర్మకు కేసుల బెడద తప్పలేదు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనకు చెందిన సుమిత్ కంభేకర్, సామాజిక కార్యకర్త షాజాద్ పానావాలా కూడా వర్మ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసులు పెట్టారు.

  • Loading...

More Telugu News