: కేసీఆర్ ను 'హిట్లర్ సీఎం'గా అభివర్ణిస్తూ జాతీయ మీడియాలో కథనాలు


కేసీఆర్ వైఖరి జాతీయ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ను 'హిట్లర్ సీఎం'గా అభివర్ణిస్తూ టైమ్స్ నౌ, హెడ్ లైన్స్ టుడే ఛానళ్లు ఈరోజు వరుస కథనాలను ప్రసారం చేశాయి. టీవీ చానళ్ల నిషేధంపై కేసీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలు 'మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు' అని టైమ్స్ నౌ, హెడ్ లైన్స్ టుడే చానళ్లు అభిప్రాయపడ్డాయి. టీవీ చానళ్ల నిషేధంపై కేసీఆర్ క్షమాపణ చెబుతారని ఆశించామని... దానికి భిన్నంగా ఆయన మరింత రెచ్చిపోయారని ఆంగ్ల మీడియా వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News