: కేసీఆర్ కేవలం మాటలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు: కిషన్ రెడ్డి


కేసీఆర్ తన వందరోజుల పాలనలో కేవలం మాటలతోనే ప్రభుత్వాన్ని నడిపించారని... చేతల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. కోటి ఆశలతో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన తెలంగాణ ప్రజలకు కేసీఆర్ తీవ్ర నిరాశకు మిగిల్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రణాళికలో లక్ష రూపాయల వరకు రైతులకు రుణ మాఫీ చేస్తానని ప్రకటించిన కేసీఆర్... ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ కావాలనే రుణమాఫీ అమలు చేయలేదని ఆరోపించారు. ఈ కారణంగా, ఖరీఫ్ సీజన్ లో రైతులకి బ్యాంకులు లోన్స్ ఇవ్వడానికి నిరాకరించడంతో... వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి పంటలు వేశారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News