: కేసీఆర్ పై మండిపడ్డ బొత్స
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇక్కడ ఉండాలనుకుంటే తమకు శాల్యూట్ కొట్టి ఉండాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. దేశంలో ఎక్కడైనా బతికే హక్కును రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కల్పించిందని అన్నారు. తెలంగాణలో బతకడానికి కేసీఆర్ కు శాల్యూట్ కొట్టాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు గవర్నర్ పరిధిలో ఉంటాయి కాబట్టి... ఛానళ్ల నిషేధంపై గవర్నర్ నరసింహన్ వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ రోజు విజయవాడలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.