: రాజ్ భవన్ వద్ద ఒకర్నొకరు తోసుకున్న జర్నలిస్టులు, పోలీసులు
హైదరాబాదులోని రాజ్ భవన్ వద్ద జర్నలిస్టులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. తెలంగాణలో ఎంఎస్ఓలు నిషేధించిన టీవీ ఛానళ్లను పునరుద్ధరించాలంటూ జర్నలిస్టులు శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు బలవంతంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. జర్నలిస్టులను బలవంతంగా తరలించేందుకు యత్నించారు. ఈ క్రమంలో జర్నలిస్టులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకానొక సమయంలో జర్నలిస్టులకు, పోలీసులకు తోపులాట కూడా జరిగింది. ఈ క్రమంలో, కొందరు పోలీసులు రోడ్డు మీద పడిపోయారు. అనంతరం జర్నలిస్టులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.