: రాజ్ భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన... కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు


తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ప్రసారాల నిలిపివేతను వ్యతిరేకిస్తూ జర్నలిస్టులు రాజ్ భవన్ (గవర్నర్ నివాసం) వద్ద ఆందోళన చేపట్టారు. హైందవ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. జర్నలిస్టులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ మేల్కోవాలి అని రాసున్న ప్లకార్డులను జర్నలిస్టులు ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, ప్రసారాలను నిలిపివేసిన ఎంఎస్ఓలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని మండిపడుతున్నారు. ప్రస్తుతం రాజ్ భవన్ దగ్గరకు భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. నిన్న కేసీఆర్ క్యాంపు కార్యాలయం ఎదుట మహిళా జర్నలిస్టులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News