: 'టైమ్స్ ఆఫ్ ఇండియా'పై కేసు వేసిన జయలలిత


ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక 'టైమ్స్ ఆఫ్ ఇండియా'పై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసు వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా వార్తలను ప్రచురించారని ఆరోపిస్తూ చెన్నైలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. తమిళ జాలర్ల విషయంలో తన పరువును దిగజార్చేలా టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాలు ప్రచురించిందని పిటిషన్ లో ఆరోపించారు. దీనికితోడు, తమిళనాడు జాలర్లు శ్రీలంకలో బందీలుగా ఉండటంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలను ప్రచురించడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో, టైమ్స్ ఆఫ్ ఇండియాతో పాటు సుబ్రహ్మణ్యస్వామిపై కూడా జయ పరువునష్టం దావా వేశారు.

  • Loading...

More Telugu News