: పాకిస్థానీ క్రికెటర్ల పట్ల ఐసీసీ పక్షపాతం చూపుతోంది: అబ్దుల్ ఖాదిర్


పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్, వన్డే ఫార్మాట్లో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ సయీద్ అజ్మల్ ను ఐసీసీ సస్పెండ్ చేయడంపై మాజీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ తీవ్రంగా స్పందించాడు. పాకిస్థాన్ క్రికెటర్ల పట్ల ఐసీసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించాడు. నియమాలు, నిబంధనలు అన్నీ కూడా పాక్ ఆటగాళ్ళకే వర్తింపజేస్తున్నారని మండిపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి అంశం ఏదైనా తెరపైకి వస్తే, తమ ఆటగాళ్ళే బలవుతున్నారని ఖాదిర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకప్పుడు తాము రివర్స్ స్వింగ్ ను పరిచయం చేస్తే, దాన్ని మోసం అని విమర్శించారని, ఇప్పుడందరూ రివర్స్ స్వింగ్ చేస్తున్నారని తెలిపాడు. ఈ దిగ్గజ లెగ్ స్పిన్నర్ పనిలోపనిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పైనా విరుచుకుపడ్డాడు. ఐసీసీతో తేల్చుకునే సత్తా పీసీబీకి లేదని విమర్శించాడు. బీసీసీఐ గానీ, శ్రీలంక క్రికెట్ బోర్డు గానీ ఐసీసీని ఎలా ఆడిస్తున్నాయో చూడాలని పీసీబీకి సూచించాడు. ఆ రెండు బోర్డులు వారి ఆటగాళ్ళను కాపాడుకునేందుకు ఎల్లప్పుడు ముందుంటాయని అన్నాడు.

  • Loading...

More Telugu News